నడి రోడ్డు పై హీరోయిన్ ను చితకబాదిన లేడీస్..సెన్సేషనల్ వీడియో వైరల్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ట్రోలింగ్ కి కూడా అవుతుంది. అయితే ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ రెవినా టండనా. రీసెంట్గా రవీనా టండన్ పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సెన్సేషనల్ గా మారింది. అయితే అందులో రవినా తనను కొట్టొద్దు అంటూ అక్కడి వాళ్లను బ్రతిమాలడం కూడా కనిపిస్తుంది. దీంతో రవినా ఫాన్స్ ఆమెకు ఏమైంది..? అంటూ సెర్చ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..

రవినాతో పాటు ఆమె కార్ డ్రైవర్ పై కూడా రాళ్లు దాడి జరిగినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రవినా తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళింది . ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా వెస్ట్ క్వార్డర్ రోడ్డు వద్దకు వెళ్లగానే వీరు కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది . రవీనా కారు ముందు వెళ్తున్న మరొక కారును ఢీ కొట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కావడంతో కోపంతో వాళ్ళు కారు దిగి రవీనా కారుని ఆపేసి మరి దాడికి పాల్పడ్డారట. డ్రైవర్ను కిందకి దింపి మరీ కొట్టారట.

అయితే తన డ్రైవర్ని అందరూ కలిసి కొడుతూ ఉండడంతో .. హీరోయిన్ రవీనా కూడా కారు దిగి వారిని ఆపే ప్రయత్నం చేసిందట . గొడవ మరింత పెద్దది కావడంతో రవినా ను కూడా కొట్టడానికి ట్రై చేశారట . అప్పుడు రవీనాను అక్కడి వాళ్లను నన్ను కొట్టకండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుందట . ఆ వీడియో ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అసలు తప్పు ఎవరిది ..? ఎవరు..? ఎవరి కారుని ఢీకొట్టారు ..? ఇది కావాలనే జరిగిన ప్లాన్ నా..? బై మిస్టేక్ పొరపాటున జరిగిన యాక్సిడెంట్ ఈ విషయాలు పోలీసులు విచారిస్తున్నారు..!!