బిగ్ బ్రేకింగ్: మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. వైసీపీకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

ప్రజెంట్ ఏపీలో ఎలాంటి పొలిటికల్ హీట్ ఎలా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది గంటల్లోనే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది . అంతేకాదు పలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా సెక్యూరిటీ కల్పించారు . అయితే ఇలాంటి క్రమంలోనే వైసిపికి భారీ షాక్ ఇస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేము అంటూ తేల్చి చెప్పేసింది సర్వోన్నత న్యాయస్థానం. పోస్టల్ బ్యాలెట్ ఓటు పై సీలు లేకున్నా కౌంటింగ్ కు అర్హత ఉంటుంది అని తేల్చి చెప్పేసింది హైకోర్టు. ఈ తీర్పును వైసిపి సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్లు పీటీషన్ దాఖలు చేసింది. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది . సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విధంగానే ఫాలో అవుతుంది అని ..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేము అని క్లారిటీ ఇచ్చేసింది . ఇది వైసీపీకి భారీ షాక్ అంటున్నారు ఏపీ రాజకీయ విశ్లేషకులు .

ఆల్రెడీ రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ వైసిపి ప్రభుత్వం దారుణంగా కూలిపోబోతుంది అంటూ ప్రకటించేసింది . మరికొద్ది గంటల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది. ఇన్నాళ్లు సీఎం గా ఉన్న వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఇకపై మాజీ కాబోతున్నాడు అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఇలాంటి మూమెంట్లోనే వైసిపి ప్రభుత్వంకి భారీ షాకిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వైసిపి నేతల్లో బిగ్ టెన్షన్ క్రియేట్ చేసింది . మరికొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయాలలో భారీ పరిణామం చోటు చేసుకోబోతుంది ..గవర్నమెంట్ మారిపోబోతుంది ..పాత గవర్నమెంట్ కూలిపోబోతుంది అంటూ జనాలు ఓ విధంగా మాట్లాడుకుంటున్నారు…!!