డైలీ లైఫ్ స్టైల్‌లో చాలామందికి ప్లాస్టిక్ వాటర్ బాటిళలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్లడానికి ప్రయాణమైన వారు కచ్చితంగా వాటర్ బాటిళను తమతో పాటు క్యారీ చేస్తూ ఉంటారు. అయితే హెల్త్ కాన్షియస్‌తో కొంతమంది స్టీల్, కాపర్ వాటర్ బాటిల్ వాడుతూ ఉంటారు. అయితే చాలామంది వీటిపై అవగాహన లేక లేదా ఖరీదు ఎక్కువనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వాటర్ బాటిలను వాడుతూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీటి వాడకంతో శరీరంలో విషం నిండుతుందని చెప్తున్నారు నిపుణులు.
ప్రాసెసింగ్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ తాజా అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో ఓ లీటర్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ లో సుమారు 2.40 లక్షల ప్లాస్టిక్ కణాలు ఉంటాయని.. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు వివరించారు. అలాగే తాజా పరిశోధనలో ఒక ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న ఒక లీటర్ నీటిలో లక్ష కంటే ఎక్కువ నానో ప్లాస్టిక్లను పరిశోధకులు కనుగొన్నారట. ఇవి చాలా చిన్న కణాలు రక్త ప్రసరణ ద్వారా మెదడుకు చేరుకుంటాయంటూ వారు వెల్లడించారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్లాస్టిక్ బాటిళ్లలో వాటర్ తాగే అలవాటులను మానుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో ఉన్న నీళకి సూర్య రశమి, వేడి తగిలినప్పుడు ఆ వాటర్ లోకి కొన్ని భయంకర రసాయనాలు రిలీజై శరీరానికి హాని కలిగిస్తాయని వారు వెల్లడించారు. అయితే ప్లాస్టిక్ ను కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ క్లోరైడ్లతో తయారు చేస్తారు. ఇక ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో రకాల భయంకర సమస్యలు తలెత్తుతాయి. వాటిలో మధుమేహం, గుండు సంబంధిత సమస్యలతో పాటు సంతాన ఉత్పత్తికి కూడా ఆటంకం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీరు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట.