బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ సాధించి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్నారు. డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాబోయే ఆరు నెలల్లో తెలుగు సినిమాల హవా ఓ రేంజ్ లో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలకు కాస్త భయం పెరుగుతుందన్న వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆ భయాన్ని కప్పిపుచ్చుకొని వరుస సినిమాలతో థియేటర్స్‌కి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అక్కడ స్టార్ హీరోస్. ముఖ్యంగా సౌత్ సినిమా డైరెక్టర్లపై వాళ్లు ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రణ్‌బీర్ కపూర్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో యానిమల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రణ్ బీర్ మరోసారి సౌత్ సినిమా డైరెక్టర్ తోనే సినిమా చేయాలని టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఆయన మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పుడు కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న రణ్‌బీర్ తర్వాత కూడా తెలుగు దర్శకులతోనే మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడని.. ఇక ఇప్పటికే దానికి సంబంధించిన స్టోరీ టాక్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఆ తెలుగు డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న వ్యక్తి అనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం నితీష్ తివారి డైరెక్షన్‌లో భారీ బడ్జెట్ తో వస్తున్న బాలీవుడ్ రామాయణంలో బిజీగా ఉన్నాడు రణ్‌బీర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.