తెలుగు కమెడియన్ వేణు యెల్దండికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకున్నాడు. తరువాత వేణు డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో పాటు నేషనల్ అవార్డులను దక్కించుకుంది.
దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఇక వేణు నెక్స్ట్ మూవీ నానితో కలిసి తెరకెక్కించనున్నాడని.. ఈ సినిమాకు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బ్యాడ్ న్యూస్ వైరల్ గా మారింది. కథ బేసిక్స్ మాత్రమే విన్న నాని ఇటీవల స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడట.
దీంతో నాని, వేణు కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని భావించారు మేకర్స్. అయితే దురదృష్టవశాతు ఇది సెట్స్ పైకి రాకముందే ఆగిపోయిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో నాని ఫాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఎప్పుడు చిన్న డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తూ సక్సెస్ అందుకునే నాని.. మంచి కంటెంట్ తో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వేణు లాంటి స్టార్ డైరెక్టర్ ను ఎలా రిజెక్ట్ చేశాడంటూ షాక్ అవుతున్నారు.