టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ మనమే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడం.. శర్వానంతో పాటు హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, పీపుల్స్ మీడియా బ్యానర్ కు చాలా కీలకం కానుంది. మనమే సినిమాకు సంబంధించిన మెజారిటీ సన్నివేశాలను లండన్ లో షూట్ చేయగా.. ఈ సినిమా ట్రైలర్ కలర్ ఫుల్ గా కనిపించింది.
అయితే శర్వానంద్ తర్వాత మూవీ సంపత్ నంది డైరెక్షన్‌లో ఉండనుందని టాక్ నడుస్తుంది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది.. డైరెక్షన్‌కు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వీరిద్దరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇటీవల కాలంలో శర్వానంద్ కూడా మాస్ రోల్‌లో కనిపించిందే లేదు. చరణ్ డైరెక్టర్‌కు.. శర్వానంద్ ఛాన్స్ ఇవ్వడంతో నెటింట ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే శర్వానంద్ మనమే మూవీ రిలీజ్ తర్వాత.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సర్వానంద్ సంపత్‌నంది కాంబినేషన్ అసలు ఊహించని కాంబో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం సాయితేజ్, సంపత్ నంది కాంబోలో సినిమా ఆగిన సంగతి తెలిసిందే. ఏ సినిమా ఆలస్యం అవుతుందని.. దీంతో ఆ సమయంలో శర్వానంద్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట యంగ్ డైరెక్టర్ సంపత్ నంది. శర్వానంద్‌తో ఎలాంటి కథను తెరకెక్కించి సంపత్ సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.