ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పెళ్లి అనగానే.. అదో సంచలనంగా తెగ ట్రెండ్ అవుతుంది. చాలామంది నటీమణులు డేటింగ్ చేసి కొంతకాలానికి పెళ్లి పీటలు ఎక్కుతుంటే.. మరికొందరు మాత్రం పెద్దలు అంగీకారంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు తెలియకుండానే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు సడన్ షాక్ ఇస్తున్నారు. అలా తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడిని పరోక్షంగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో ఆ బంధానికి శుభం కార్డు వేయబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు రవితేజ తో కలిసి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించిన రజీషా విజయన్.
మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసిన ఈ అమ్మడు కేరళ సోయగం. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న రజిష.. 2016లో మలయాళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సొంతం చేస్తుంది. 2021లో తమిళ్లో కర్జన్ సినిమాతో ధనుష్ జంటగా నటించి మెప్పించింది. ఆ తర్వాత జై భీమ్, సర్దార్ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. సర్దార్ సినిమా తర్వాత కోలీవుడ్లో రజిషకు అవకాశాలు రాలేదు.
తెలుగులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ లో నటించి ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. బహుభాషా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో త్వరలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మలయాళ స్టార్ ఫోటోగ్రాఫర్ టోఫిన్ థామస్ తో ఈ అమ్మడు ఏడడుగులు వేయబోతుందని సమాచారం. గతంలో వీళ్ళిద్దరూ కోకో, లవ్లీ యువర్ సినిమాలకు కలిసి పనిచేశారు. అలా వీరిద్దరి మధ్యన స్నేహం మొదలై ప్రేమ వరకు వెళ్లిందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.