టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ కు విశ్వక్ డైహార్ట్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ పలు సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా తారక్ సందడి చేశారు. అయితే చూడడానికి కొద్దిగా యంగ్ టైగర్ పోలికలతో ఉండే విశ్వక్.. త్వరలోనే ఈయనతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ప్రశాంత్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాల్లో విశ్వక్ నటించబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా విశ్వక్సేన్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు దీనికి మరింత బూస్టర్బ్ గా మారాయి. ఛాన్స్ వస్తే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో నటించాలని ఆయన వివరించాడు. తన మాటలు ఇప్పుడు నెట్టింట మరింత ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విశ్వక్ కూడా ఈయన సినిమాలో నటిస్తే ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతుందని.. విశ్వక్కు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటి దక్కుతుందని.. ఈ సినిమా సక్సెస్ సాధించడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.