బిగ్‌బాస్ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిల్ని హోటల్కి పిలుస్తారు.. నటి గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ బ్యూటీ గాయత్రి గుప్తా పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు నటిస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. ప్ర‌ధానంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే గాయత్రి గుప్తా ఇటీవ‌ల కాలంలో ఇండస్ట్రీ గురించి.. ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ సంఘటనల గురించి షాకింగ్ విషయాలను రివిల్ చేస్తోంది. గతంలోనూ ఈ అమ్ముడు కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆఫర్స్ కోసం కొంతమంది హీరోయిన్స్ ఇష్టంగా కమిట్మెంట్స్‌ ఇస్తారంటూ చెప్పిన ఈ అమ్మడు.. బేబీ మూవీ కాపీ చేశారని వివ‌రించింది.

అంతకుముందు ఆ క‌థ‌కు తానే హీరోయిన్గా ఓకే చేశాన‌ని.. ఇదే కథతో సినిమా కూడా మొదలైందని వివరించింది. ఇక గతంలో బిగ్ బాస్ పై పలు విమర్శాత్మక కామెంట్స్ చేసిన ఈ అమ్మడు.. మరోసారి తాజాగా ఈ షో పై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందని కొన్ని విభేదాల కారణంగా ఆ షోకు వెళ్లలేదంటూ వివరించింది. ఈ క్రమంలో మరోసారి బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షో కి వెళ్ళాలంటే ముందుగా కాంట్రాక్ట్ పై సంతకం చేయాల్సి ఉంటుందని.. దాంట్లో చాలా రూల్స్ ఉంటాయని.. వాటిలో బిగ్ బాస్ కు ఓకే అయిన తరువాత ఏ సినిమాలు ఒప్పుకోకూడదు.. ఆ కారణంతో నేను దాదాపు 15 సినిమాలను వదులుకున్న అంటూ వివరించింది.

Gayatri Gupta - Photos, Videos, Birthday, Latest News, Height In Feet -  FilmiBeat

అయితే ఏమైందో తెలియదు కానీ తను సడన్గా బిగ్ బాస్ నుంచి తీసేసారని.. తనకు భారీ నష్టం జరిగిందంటూ నష్టపరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అలాగే ఆడిషన్స్ పేరుతో ఆడపిల్లలను హోటల్స్‌కు తీసుకువెళ్తున్నారు అంటూ వివరించింది. తనకు నాగార్జునపై, ఆశోపై ఎలాంటి వ్యతిరేకత లేదని.. కేవలం దాని నిర్వాహకులపై మాత్రమే పోరాడుతున్నానంటూ వివరించింది. బిగ్బాస్ గురించి నేను కొర్ట్‌కు వెళ్లడం వల్ల చాలా రూల్స్ మారాయి అని.. అలాగే ఎంతో మందికి నష్టపరహారం కూడా అందించార‌ని ఈ విషయం స్వయంగా బిగ్ బాస్ లో పాల్గొన్న కొంతమంది కంట్రీస్టెంట్స్‌ తనకు చెప్పారు అంటూ వివరించింది. ప్రస్తుతం గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.