బాలయ్య ఇష్యుపై తెలుగు స్టార్ హీరోలు స్పందించకపోవడానికి కారణం అదేనా..? అందరూ అలాంటి మగాళ్లేనా..?

గత రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ..హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా కొంతమంది ఆయనను దారుణాతి దారుణంగా వర్ణించలేని పదాజాలంతో దూషిస్తున్నారు . కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన నందమూరి బాలయ్య .. అంజలితో ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది .

అంజలిని స్టేజిపై తోసేయడం అందులో చనువుగా మూవ్ అవ్వడం ..ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్న కొన్ని వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి . అయితే ఇది మొత్తం కావాలనే కొందరు ఆడుతున్న డ్రామా అని.. విశ్వక్సేన్ అదేవిధంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందించారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ బడా స్టార్ హీరో పై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటే మిగతా హీరోలు ఎవరు స్పందించకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మేం బాలయ్య ఫ్యాన్స్ అని చెప్పుకొని విర్రవీగే వాళ్ళు .. ఇప్పుడు ఏం పీకుతున్నారు.. అనే విధంగా నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. బాలయ్య తప్పు చేయలేదు అన్న విషయం అందరికీ తెలుసు . మరి ఎందుకు ఆ హీరోలు నోరు మూసుకొని ఉన్నారు అనే విషయం ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. దీంతో పలువురు కావాలని నందమూరి బాలయ్యను ఇరికిస్తున్నారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!