ఇన్నాళ్ళకి మనసులోని కోరికను బయటపెట్టిన కాజల్.. అలా చేయాలని ఉందంటూ..?!

సత్యభామ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కాజల్ వరస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తుంది. తన సినిమా కబుర్లతో పాటు ఇతర అంశాలపై కూడా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది.

ఇక ఇటీవల ఇంటర్వ్యూలో కాజల్‌కు తెలుగు మాట్లాడగలిగే నటలకే ఇక్కడ ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.. అప్పట్లో ఇలా ఉండేది కాదు కదా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఆమె స్పందిస్తూ నా విషయంలో ఎప్పుడూ అలా జరగలేదని.. ఫ్యాన్స్, ఆడియన్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారంటూ వివరించింది. నటనకు భాష అవసరం లేదు.. అయినా నేర్చుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశా.. ఇంకా చేస్తూనే ఉన్నా అంటూ వివరించింది.

Anushka Shetty Vs Nayanthara by ChaudhrySahb on Febspot

అలాగే హీరోయిన్ల విషయంలో ఐరన్ లెగ్ అనే కామెంట్స్ పై ఆమె మాట్లాడుతూ.. ఆ ఆలోచన విధానం మారాలి. హీరోయిన్ సినిమాలో ఒక భాగం మాత్రమే.. ఏ సినిమా అయినా ఫ్లాప్ అయితే హీరోయిన్ పైన నెగటివ్ గా మాట్లాడడం అసలు సరైన పద్ధతి కాదు అంటూ వివరించింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే కాజల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో నయనతార, అనుష్క శెట్టితో సినిమాల్లో కలిసి నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం కాజల్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.