తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఓ సంచలన కాంబోను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడంటూ ముంబై సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపొందించే ప్రయత్నలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక చివరిగా అట్లీ.. జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళను కల్లగొట్టి భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక తన నెక్స్ట్ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాల్లో ఇద్దరు సూపర్ స్టార్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రజనీకాంత్ ను కూడా అట్లీ భాగం చేయాలనే ప్లాన్లో ఉన్నాడట. ఈ ఇద్దరు స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే నెలలో రజినా, సల్మన్ ఇద్దరిని కలిసి అట్లీ తన స్క్రిప్ట్ గురించి పూర్తిగా వివరించబోతున్నాడట.
ఒకవేళ నిజంగానే వీరిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద అట్లీ మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ మురగదాస్ డైరెక్షన్‌లో సికిందర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అట్లీ, సల్మాన్ కాంబో సినిమా సెట్స్ పైకి రానుంది. ఇక ఈ సినిమాల సల్మాన్ తో పాటు రజనీకాంత్ నటిస్తున్నాడో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.