అరెరె.. ఎంత ఓవర్ యాక్టింగ్ చేసిన “కన్నప్ప” కు అదే బిగ్ మైనస్ గా మారిపోయిందా..?

కన్నప్ప .. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు . మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మోహన్ బాబు ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ – మోహన్లాల్ – ప్రభాస్ – అక్షయ్ కుమార్ – మధుబాల – శివరాజ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా భాగం అయి ఉండడం గమనార్హం.

కాగా రీసెంట్గా ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ కన్నప్ప టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే రెగ్యులర్గా యూట్యూబ్లో కాకుండా కేవలం కొన్ని థియేటర్స్ లో మాత్రమే టీజర్ విడుదల చేశారు. అందరూ చూడడానికి వీలు లేకుండా పోయింది .అయినా సరే సోషల్ మీడియాలో ఈ టీజర్ కి సంబంధించిన కొన్ని పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి . కొంతమంది పర్లేదు మంచు విష్ణు బాగానే కష్టపడ్డారు అంటుంటే మరికొందరు మాత్రం ఆయన ను ట్రోల్ చేస్తున్నారు .

అసలు కన్నప్ప ఎవరు అనే విషయం మరిచిపోయి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఉన్నారు అంటూ కొంతమంది మండిపడుతున్నారు . కన్నప్ప సినిమా టీజర్ కి అసలు ఒరిజినల్ కన్నప్ప కాన్సెప్ట్ కి ఏమి సంబంధం లేదు అని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు కేవలం టీజర్ కి ప్రభాస్ మాత్రమే హైలెట్ అవుతున్నాడు అని మిగతా పాత్రలు అంతా కూడా ఏదో తూతూ మంత్రంగా సెట్ చేశారు అని అంటున్నారు . మొత్తానికి మంచి చేయాలి అనుకున్న కూడా మంచు విష్ణుకు కన్నప్ప సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసేలానే ఉంది. సినిమాపై 50 – 50% పాజిటివ్ టాక్ ..నెగిటివ్ టాక్ వినిపిస్తుంది.. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో..??