జాతకాలు తప్పుతున్న వేణు స్వామిని వదలని హీరోయిన్స్.. మ్యాటర్ ఏంటంటే..?!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఈయన రాజీకీయాల ప‌రంగా చెప్పిన జోష్యం త‌ప్ప‌డంతో వేణు స్వామి పేరు మారింత‌గా ట్రోల్ అవుతున్న‌ సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత విడిపోతారు అంటూ మొదట జోష్యం చెప్పి అది నిజం కావ‌డంతో వార్తల్లో నిలిచిన ఆయన.. సెలబ్రిటీ జాతకాలను బట్టి వారి విజయాలు, అపజాయాలను అంచనా వేసి చెబుతూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో అలాంటి అంచనాలను వేయడం మానేసాడు వేణు స్వామి. ఏపీలో మరోసారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల ఆయన చెప్పిన జోష్యం ఫెయిల్ అవ్వడంతో భారీగా ట్రోల్స్ ను ఎదుర్కొన్న వేణు స్వామి.. తన అంచనాలు తప్పడంతో వెంటనే దానిపై క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Rashmika Mandanna Performing Secret Pooja With Venu Swamy | Rajashyamala Baglamukhi Pooja | DC - YouTube

సెంటర్లో మోడీ ఆధిపత్యం తగ్గుతుంది అంటూ నేను చెప్పిన మాట నిజమైంది.. అయితే ఏపీ ఫలితాల్లో నేను వేసిన అంచనాలు 100% తప్పాయంటూ చెప్పుకొచ్చాడు. అయితే తనని నమ్మి ఇంతకాలం తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన వేణు స్వామి.. ఏపీ రాజకీయాలపై చెప్పిన తప్పుడు జాతకానికి క్షమాపణలు చెప్పాడు. గ‌తంలో వేణు స్వామి తెలంగాణా రాజ‌కీయాల‌పై చెప్పిన జోష్యం కూడా త‌ప్పింది. ఈ క్రమంలో ఈయన చెప్పిన జాతకాలు అన్ని వరుసగా తప్పుతున్నా.. హీరోయిన్స్ మాత్రం ఆయనను వదలడం లేదు. అతనితో జాతకాలు చెప్పించుకునేందుకు లైన్లో నిలబడుతున్నారు. గతంలో వేణు స్వామితో డింపుల్ హయాతి, రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు అంతా జాతక దోష నివారణ పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.

వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు | Actress Nishvika Performs Pooja With Venu Swamy - Telugu Oneindia

ఈ రేంజ్ లో హీరోయిన్స్ ఆయన వెంట పడుతున్నారంటే.. ఆయన ప్రభావం ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వేణు స్వామి జాతకాలు ప్ర‌స్తుతం స‌క్స‌స్‌ కాకపోయినా.. ఇతర ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ కూడా ఆయనతో పూజలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్ నిశ్వికా.. వేణు స్వామి దగ్గరకు వెళ్లి పూజలు చేయించుకుందొ. 2018లో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.. ఈ 28 ఏళ్ల ఈ అమ్మడు. కన్నడలో వరుస సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. రష్మిక, నిదీ అగర్వాల్ లాంటి క్రేజీ హీరోయిన్‌లు వేణు స్వామిని నమ్మడంతో.. నిశ్వికా లాంటి వాళ్లు కూడా ఆయన కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఈ సార్‌ జాతకాలు తప్పు చెబుతున్నా.. హీరోయిన్స్ మాత్రం ఆయనను వదలడం లేదే అంటూ.. ఏ మాయ చేశావ్‌రా స్వామి హిరోయిన్‌లు నీకు స్టిక్ అయిపోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.