తన పెద్ద కూతుర్ని హీరోయిన్ చేయాలనుకున్న మెగాస్టార్.. కానీ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటంటే..?!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షణాదిమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఏడుపాదుల వయసుమీద ప‌డుతున్నా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక మెగాస్టార్ వారసుల విషయానికి వస్తే వాళ్లు తండ్రికి లాగా మొదటి నుంచి శ్రమించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాన్న‌ మెగాస్టార్. కాబట్టి వారికి ఇండస్ట్రీలో సులువుగా అవకాశాలు దక్కుతాయి. ఒకటి, రెండు ఫ్లాప్‌లు ఎదురైనా.. తట్టుకునే ధైర్యం వాళ్లకు ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి తండ్రి బ్యాక్గ్రౌండ్ అండగా ఉంటుంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా ఇండస్ట్రీలోకి కుటుంబం నుంచి ఎంతోమంది అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi has special and unexpected gift for daughter Sushmita

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని హీరోగా చేయాలని మొదటినుంచి మెగాస్టార్ భావించేవాడట. అయితే ఆయనతో పాటు తన పెద్ద కూతురు సుస్మితను కూడా హీరోయిన్ చేయాలని చిరంజీవి అనుకున్నాడు. అలా పూరి జగన్నాథ్ కు తన కూతురు సినీ ఎంట్రీకి తగ్గట్టుగా మంచి సబ్జెక్టు సిద్ధం చేయమని కూడా వివరించాడట. ఆయన అనుకున్నట్టుగానే ఓ కథ రెడీ చేసి వినిపించారట పూరీ. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించిన సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చకపోవడంతో మళ్లీ రివర్క్ చేయమని చిరంజీవి పూరి జగన్నాథ్ కు చెప్పారట. ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ హీరోగా, సుస్మిత ను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట. అల వీరిద్దరూ మొదట హీరో, హీరోయిన్‌లుగా నటించాల్సి ఉండగా స్క్రిప్ట్ ప్రాబ్లం తో ఆ సినిమా వర్కౌట్ కాలేదు. కానీ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గట్టిగా స్టార్ట్ అయ్యి తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు.

Chiranjeevi Daughter Sushmita Family Photos | Family photos, Daughter,  Photoshoot

పెళ్లి వరకు వీరి బాండ్ వెళ్ళింది. ఇంట్లో వారు కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఉదయ్ కిరణ్ ఏవో కారణాలతో చివర్లో సుస్మిత తో పెళ్లి వద్దని ఆమెను దూరం చేసుకున్నాడు. తర్వాత ఉదయ్ కిరణ్ జీవితం ఎలా ముగిసిందో అందరికీ తెలుసు. అంతకన్నా ముందే సుస్మితాని హీరోయిన్గా చేయడానికి మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా చిరంజీవి విన్నారట. అయితే ఆయనకు అవేవీ నచ్చకపోవడంతో సుస్మిత హీరోయిన్ చేయాలనుకున్న మెగాస్టార్ ఆలోచన వర్కౌట్ కాలేదు. తర్వాత ఇక సినిమాలు వద్దని పెళ్లి చేసేసారు. ఆమెకి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు.కాగా సుస్మిత‌కు ఇండ‌స్ట్రీపై ఉన్న మక్కువతో వెబ్ సిరీస్‌ల‌కు నిర్మాతగా వ్యవహరిస్తూ, మ‌రోప‌క్క‌ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ మంచి పట్టు సాధించింది. తన తండ్రి చిరంజీవి నటించిన సైరా సినిమా నుంచి ఇప్పటివరకు సుస్మిత నే మెగాస్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంది.