రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. కాదు కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ..నేషనల్ క్రష్ ట్యాగ్ చేయించుకొని పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీని రేంజ్ లో ఏలేస్తుంది . ఇప్పుడు రష్మిక ఖాతాలో మూడు తెలుగు సినిమాలు ..రెండు తమిళ్ సినిమాలు .. ఆరు హిందీ సినిమాలో ఉన్నాయి ..అంటే ఆమె రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు .
కాగా తాజాగా రష్మిక మందన్నా.. మగాళ్ళపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఓ నెటిజెన్ యానిమల్ సినిమాలోని ఒక బోల్డ్ సీన్ కి సంబంధించిన వీడియోని ట్యాగ్ చేస్తూ రష్మికకు మెసేజ్ చేస్తుంది . అబ్బాయిలు చీట్ చేసే వాళ్ళు అనే విధంగా ట్విట్ చేస్తుంది. దీనికి రష్మిక మందన్నాను కూడా ట్యాగ్ చేస్తుంది. అయితే రష్మిక మందన్నా.. ఆమెకు రిప్లై ఇస్తూ స్మాల్ చేంజ్ .. అబ్బాయిలలో భయంకరమైన వాళ్లే కాదు.. మంచి మనుషులు కూడా ఉంటారు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు రిప్లై ఇచ్చింది .
దీనితో రష్మిక మందన్నా చేసిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. అబ్బాయిలు అందరూ దుర్మార్గులుగా ఉండరు అని.. కొందరు మాత్రమే అలా ఉంటారు అని .. ప్రేమించి నమ్మించి చీట్ చేసే వాళ్ళు ఉన్న ప్రేమకు
విలువ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పకనే చెప్పేసింది. రష్మిక మందన్నా ప్రజెంట్ ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరు రష్మిక పేరుని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!