ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 ఏడి.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సంగతి తెలిసిందే. జూన్ 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాలీవుడ్ సినిమాకు దీటుగా సినిమా విజువల్స్ ఉన్నాయంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వెలువడ్డాయి.
అయితే ఎందుకు ట్రైలర్ ఊహించిన రేంజ్‌లో హైప్ రాలేదు.
దీంతో రికార్డ్ క్రియేట్ చేయలేకపోయింది. కల్కి తెలుగు ట్రైలర్ కి కేవలం 14.43 మిలియన్ వ్యూస్ మాత్రమే దక్కాయి. చెప్పాలంటే ప్రభాస్ రేంజ్ కి ఇది చాలా తక్కువ. ఇక ఇప్పటివరకు హైయెస్ట్ వ్యూస్ సంపాదించిన తెలుగు ట్రైలర్స్ ని గమనిస్తే గుంటూరు కారం 36.65 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని టాప్ టెన్‌లో మొదటి ప్థానం దక్కించుకుంది. తెలుగు హైయెస్ట్ వ్యూస్ ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది. అయితే గుంటూరు కారం తర్వాత సలార్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య, బాహుబలి 2, ఆర్‌ఆర్ఆర్, కె జి ఎఫ్ 2, బ్రో, వకీల్ సాబ్ సినిమాలు టాప్ టెన్ గా నిలిచాయి.
చివరకు టాప్ టెన్ లిస్ట్‌లో కూడా కల్కీ చోటు దక్కించుకోలేకపోయింది. రీజినల్ మూవీ అయిన గుంటూరు కారం రికార్డ్స్ ని కూడా కల్కి బ్రేక్ చేయలేకపోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆశక్తి తగ్గిందని.. 24 గంటలు గడిచిన తర్వాత కేవలం ఇంత తక్కువ వ్యూస్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు మూవీ పై ఆశక్తిగా లేరంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి ట్రైలర్ పై హైప్ పెంచి.. వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు బాట్స్ టీం అనేది ఉంటుంది. కల్కి ట్రైలర్ కు అలాంటి టీం ఏమీ లేదేమో.. అందుకే తక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.