ఆ విషయంలో ఫ్యాన్స్ ను తృప్తి పరచలేకపోతున్న దిమ్రి.. దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుందా..?

తృప్తి దిమ్రి ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే ఎవరా ..? అని ఆలోచించేవాళ్ళు . అయితే సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అనిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అలా ఇలా కాదు నేషనల్ క్రష్ లాంటి రష్మిక మందన్నా.. ఆ సినిమాలో నటించిన సరే అందరి కళ్ళు తృప్తి పైనే పడ్డాయి .. అంటే అమ్మడు ఏ రేంజ్ లో హాట్ నెస్ ను క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత తెలుగులో తృప్తి పేరు మారు మ్రోగిపోతుంది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బడా స్టార్స్ నటించే మూడు సినిమాలలో అవకాశం దక్కించుకుంది అంటూ వార్తలు వినిపించాయి . విజయ్ దేవరకొండ – అల్లు అర్జున్ – రామ్ చరణ్ లతో నటించే ఛాన్సెస్ కూడా దక్కించుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ ప్రకటన రాకపోవడం గమనార్హం. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తృప్తి పెద్దగా యాక్టివ్ గా ఉండలేక పోతుంది .

అనిమల్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఇంకా డబల్ చేసుకోకుండా అభిమానులను తృప్తి పరచలేకపోతూ తనకు తానే తన కెరీర్ ని డౌన్ ఫాల్ చేసుకుంటుంది తృప్తి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తృప్తి తెలుగులో అవకాశాలు వస్తున్నా సరే కొన్ని మూవీస్ కి సైన్ చేయడం లేదట .ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ కూడా ఆమెపై మండిపడుతున్నారు . తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయితే ఆమె కెరీర్ కి ఇంకా మంచి రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏమో మరి తృప్తి ఎందుకు తెలుగు సినిమాలకు సైన్ చేయడం లేదో ఆమెకే తెలియాలి..!?