నమ్రత శిరోద్కర్ విషయంలో మహేష్ బాబు చేసిన అతి పెద్ద తప్పు ఇదే ..ఇప్పటికీ అలానే చేస్తున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో మహేష్ బాబును బాగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. రీజన్ ఏంటో తెలియదు కానీ కావాలని ఆయన పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు మహేష్ బాబు అభిమానులు . గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ బాబుని ఏ రేంజ్ లో ఏకిపారేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ అన్న ఇమేజ్ ని కూడా పక్కన పెట్టేసి ఆయనపై దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషించారు.

కాగా రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబుని ట్రోల్లింగ్ చేస్తూ ఒక బ్యాచ్ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. తన భార్యను నమ్రత శిరోద్కర్ విషయంలో మహేష్ బాబు సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు . మనకు తెలిసిందే నమ్రత శిరోద్కర్ ఒక పెద్ద హీరోయిన్ ..చాలా చాలా హిట్స్ అందుకుంది.. మంచి టాలెంటెడ్ హీరోయిన్ .. అయితే పెళ్లి తర్వాత ఆమెను ఇండస్ట్రీకి దూరం చేసిన ఘనత మహేష్ బాబు కే దక్కింది .

 

నిజానికి నమ్రత కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా మెలగాలి అని ఎదగాలి అని కోరుకుందట . కానీ మహేష్ బాబు పెళ్లి తర్వాత అన్నిటికి దూరమవ్వాలన్న కండిషన్ తోనే కండిషన్ పెట్టాడట . మహేష్ బాబు పై ఉన్న ఇష్టంతోనే నమ్రత తన కెరీర్ ని స్పాయిల్ చేసుకుంది అని .. మహేష్ బాబు ఆ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అని.. నమ్రతా శిరోద్కర్ వయస్సు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అని ..మహేష్ బాబు మాత్రం నమ్రత ని సినిమాలో నటించకుండా ఆమె కెరియర్ని తొక్కేశాడు అని ప్రచారం చేస్తున్నారు . ఇప్పటికి పలు సినిమాలలో అవకాశాలు వస్తున్న సరే మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ విషయంలో అంతే కఠినంగా ఫాలో అవుతున్నారట . కుటుంబ పూర్తి బాధ్యతలను నమ్రత పై వదిలేసి ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటున్నారు అని నమ్రతలో ఉన్న టాలెంట్ ని తొక్కేస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు..!!