బన్నీ ఆ పని చేస్తే మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారా.. అయినా ఎందుకు చేయడం లేదు..!?

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు బన్నీ ఏదో మంచి చేయాలి అనుకున్నాడు. అయితే అది కాస్త తుస్సుమంటూ ఫ్లాప్ అయిపోయింది . తన ఫ్రెండ్ శిల్పా రవికి సపోర్ట్ చేయాలి అనుకున్నాడు . అది పెద్ద తప్పు మేటర్ కాదు . అయితే ఇంట్లో తన మామయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని పెట్టుకొని ఆయనకు యాంటీగా వర్క్ చేస్తున్న పార్టీ మెంబర్ కి సపోర్ట్ చేయడం బన్నీకూ పెద్ద తలనొప్పులే క్రియేట్ చేసింది. అలా ఇలా కాదు ఇప్పుడు ఆయనను మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసే రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటికే మెగా ఫ్యామిలీ దూరం కూడా పెట్టేసిందట . మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ను అన్ ఫాలో చేయడం ప్రారంభించారు. బన్నీ స్నేహ రెడ్డి అకౌంట్లను సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేసేసినట్లు ప్రచారం జరుగుతుంది . అయితే బన్నీ ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీతో కలిస్తే కచ్చితంగా మెగా ఫాన్స్ కూల్ అవుతారు . ఒక్కసారి ఇంటికి వెళ్లి చిరంజీవి – పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగిన బాగా మింగిల్ అయినా కచ్చితంగా బన్నీ పేరు మళ్లీ మారుమ్రోగిపోతుంది.

అయితే ఈ విషయం తెలిసిన బన్నీ అదేవిధంగా అల్లు అరవింద్ ఎందుకు మెగా ఫ్యామిలీకి దగ్గర కాలేకపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది . నిజంగానే బన్నీ వాంటెడ్ గా మెగా ఫ్యామిలీ ని దూరం పెట్టడానికి ఇలా చేశాడా ..?నాది పాన్ ఇండియా రేంజ్ ఇక నాకు వాళ్ళతో అవసరం ఏముంది అనుకున్నాడా..? అందుకే ఇలా చేస్తున్నాడా..? అంటూ జనాలు కూడా బన్నీ ప్రవర్తన పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమో బన్నీ తీసుకునే స్టెప్స్ ఫ్యూచర్లో బన్నీ కెరియర్ కు ఎలాంటి నష్టం కలగ జేస్తుందో అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!