త్వరలోనే నాని కూడా ఆ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడా..? ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలా తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా హీరో నానికి అభిమానుల్లో ఓ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . ఏ పాత్రనైనా సరే అవలీలగా నటించేస్తాడు అన్న బిరుదు కూడా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు.

కాగా నాగార్జునతో కలిసి దేవదాస్ అనే సినిమాలో నటించిన నాని .. ఆ తర్వాత మల్టీ స్టారర్ జోలికి వెళ్లలేదు . అయితే ఇప్పుడు నాని కూడా మల్టీ స్టారర్ ట్రెండ్ ని ముందుకు తీసుకెళ్లడానికి చూస్తున్నాడట . త్వరలోనే హీరో వెంకటేష్ తో నాని బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా టైప్ కాన్సెప్ట్ లో ఈ మూవీ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమా డైరెక్టర్.. హీరోయిన్లకి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

వెంకటేష్ ఫ్యామిలీ హీరో.. నాని న్యాచురల్ హీరో.. ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే ఇక కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..? రచ్చ రంబోలా గానే ఉంటుంది. ఈ కాంబో పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా మల్టీ స్టారర్ మూవీ గా రాబోతుండడంతో ఈ సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??