శోభిత ధూళిపాళ.. తెలుగు హీరోయిన్ నే కానీ బాలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తద్వారా తెలుగులోనూ బాగా క్రేజ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో డేటింగ్ అన్న అంశంపై శోభిత ధూళిపాళ రేంజ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయిందని చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకుంటున్నారా..? డేటింగ్ లో ఉన్నారా..? పెళ్లి చేసుకుంటున్నారా? అన్ని ప్రశ్నర్ధకంగానే ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు .
మా మధ్య ప్రేమ లేదు అంటూనే కలిసి తిరుగుతున్నారు. వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయినా సరే పరోక్షంగా వాళ్ళ మధ్య ప్రేమని బయటపెడుతున్నారే .. తప్పిస్తే అఫీషియల్ గా మేము ప్రేమాయణం నడుపుతున్నాం అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఎప్పుడు చాలా అల్లరి అల్లరిగా ఉండే శోభితా ధూళిపాల ఈసారి చాలా మూడీగా కూర్చొని ఉన్న ఫోటో ట్రెండ్ అవుతుంది.
షిప్లో ఎవ్వరు లేకుండా ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటో ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన జనాలు నాగచైతన్యతో గొడవైందా ..?అంటుంటే మరికొందరు నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు ప్రేమించిన వ్యక్తి పేరు కూడా బయటకు చెప్పలేని పొజిషన్లో ఉన్నవ్ అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా తెలుగులో గూఢాచారి సినిమాలో నటించిన శోభితా ధూళిపాల ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. చూద్దాం మరి ఈ బ్యూటీకి అక్కినేని ఇంటికి కోడలు అయ్యే అదృష్టం ఉందో లేదో..?
View this post on Instagram