టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నం. అనౌన్స్ చేసిన సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ ఎలా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడో కూడా మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాను అంటూ అఫీషియల్ ప్రకటన చేశాడు .
వీళ్ళ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి . మూడు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . కాగా నాలుగో సారి వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై షూట్ ఎక్స్పెక్టేషన్స్ నెకొన్నాయి . అయితే ఈ సినిమా అఖండ 2 గా రాబోతుందా..? లేకపోతే కొత్త కథతో రాబోతుందా ..? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది . అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైనా సరే సినిమాలో హీరోయిన్ మాత్రం నయనతారనే ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు .
బాలయ్యకు నయనతార లక్కీ హీరోయిన్ అని.. వాళ్ళ కాంబో అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని .. ఈ సినిమాలో ఆమెను హీరోయిన్గా పెట్టుకోవాల్సిందే అంటూ బోయపాటిని డిమాండ్ చేస్తున్నారు. సరికొత్త హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నయన్-బాలయ్య కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అందరికి తెలిసిందే..!!