ఆ బిగ్ మల్టీస్టారర్ లో జూనియర్ ఎన్టీఆర్ ..ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే కాంబో ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ మూవీలో నటించిన బిగ్ బ్లాక్ బస్టర్ ని.. తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చింది . ఆ తర్వాత రామ్ చరణ్ రేంజ్ లో మారిపోయింది. ప్రజెంట్ ఇద్దరు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అదే స్థాయిలో సినిమాలను సైతం యాక్సెప్ట్ చేస్తున్నారు . తాజాగా ఎన్టీఆర్ మరో బిగ్ బడా హీరోతో మల్టీస్టారర్ మూవీకి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో బాబీ డియోల్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో ఒక బడా పాన్ ఇండియా స్టార్ కూడా నటించబోతున్నారట . ఈ విషయాన్ని త్వరలోనే పూజా కార్యక్రమాలలో రివిల్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్ . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆ హీరో ఎవరో అంటూ గెస్ చేసే పనిలో బిజీ అయిపోయారు..!!