నాగార్జునకి అక్కినేని నాగేశ్వరరావు అలాంటి కండిషన్ పెట్టాడా ..? అందుకే ఎప్పటికీ ఆ పని చేయడా..?

అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో అక్కినేని అన్న పదానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పటికి ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే కారణం అక్కినేని నాగేశ్వరరావు గారి కష్టమనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చిన నాగార్జున సైతం అదే విధంగా ఆయన పేరును ట్రెండ్ చేశారు . ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య అఖిల్ మాత్రం అక్కినేని అనే పేరుని పై స్థానానికి తీసుకురాలేకపోతున్నారు .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో ఎప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాడో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోయిన్స్ తో చాలా జోవియల్ గా సరదాగా మూవ్ అయ్యి అక్కినేని నాగార్జున ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోయిన్స్ తో నటించారు. కానీ ఓ హీరోయిన్ తో మాత్రం నటించలేదు . ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయినా సరే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేశాడు .

అయితే దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు ఆమెతో నటించకూడదు అంటూ పెట్టిన కండిషనే అని అప్పట్లో ప్రచారం జరిగింది . అంతేకాదు నాగచైతన్యకు తల్లిపాత్రలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆ హీరోయిన్ నే రిజెక్ట్ చేసిందట. మరి ఆ హీరోయిన్ కి అక్కినేని ఫ్యామిలీకి మధ్య ఎలాంటి శత్రుత్వం ఉంది ..? అనేది మాత్రం బయటకు తెలియడం లేదు. మరొకసారి ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!