పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అయిన వెంటనే మెగా ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్ ..ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది..!?

మెగా ఫ్యామిలీలోకి క్లీం కార వచ్చిన వేళా విశేషం బ్యాక్ టు బ్యాక్ వరుసగా అన్ని గుడ్ న్యూస్లే వింటున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఎప్పటినుంచో కలలు కంటున్నా ఎన్నికల్లో సైతం భారీ విజయం అందుకున్నాడు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ భారీ మెజారిటీతో గెలుపొందడం డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయడం ఫాన్స్ కు ఆనందం తెచ్చిపెట్టింది .

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ గుడ్ న్యూస్లతో అభిమానులకి సందడి క్రియేట్ చేస్తున్న మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగా హీరో సుప్రీం స్టార్ సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు పెళ్లికి దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట .

అంతేకాదు త్వరలోనే ఈయన పెళ్లికి సంబంధించిన వార్తను అఫీషియల్ గానే చెప్పబోతున్నారట . క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అన్ని గుడ్ న్యూస్లే వింటూ ఉండడం గమనార్హం. పైగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అయిపోయిన వెంటనే సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ట్రెండ్ అవుతూ ఉండడం మెగా అభిమానులకి కొత్త జోష్ ని నింపింది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియాలి అంటే మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందించాల్సిందే..!?