మెగాస్టార్ సినిమాలో సమంత..జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!?

సమంత ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్.. ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ గురైందో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధికి గురైంది అంటూ మళ్ళీ ప్రచారం జరిగింది. వాటికి చెప్పకనే చెక్ పెట్టేసింది హీరోయిన్ సమంత . కాగా రీసెంట్గా ఆమె తెలుగులో చాలా కాలం తర్వాత ఒక సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ కి కావడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి .

బింబిసారా డైరెక్టర్ వశిష్ట తో విశ్వంభరా అనే సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఇప్పటికే త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. త్రిష డ్యూయల్ షెడ్ లో కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇదే క్రమంలో త్రిష తో పాటు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ లో హీరోయిన్ సమంత నటించబోతుంది అన్న వార్త ఎక్కువగా ప్రచారం జరుగుతుంది . సమంత ఈ రోల్ నచ్చే గెస్ట్ రోల్ అయినా కూడా యాక్సెప్ట్ చేసిందట.

సమంత రేంజ్ చాలా హై .. మరి అలాంటిది ఆమె ఒక గెస్ట్ రోల్ లో నటించడానికి ఓకే చేసింది అంటే అది ఎంత నచ్చి ఉంటే ఆమె అలా చేసి ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. పైగా తెలుగులో మంచి మంచి ఆఫర్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన సమంత చిరంజీవి సినిమాకి సైన్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో ..? అసలు ఈ పాత్ర ఆమెకు అంత నచ్చడానికి కారణం ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే..!?