లైఫ్‌లో ఒత్తిడితో కూడిన బంధం అవసరం లేదు.. డేటింగ్ వార్త‌ల పై టాలీవుడ్ స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..?!

యమదొంగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌కు తెలుగు ప్రేక్ష‌కులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రాళ్ళను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత పలు సినిమాల్లో వరస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోయింది. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలని చెబుతూ ఉంటారు.

Yamadonga – S. S. Rajamouli's Fantasy film is so much fun – my first film with Jr. NTR! – Pardesi Reviews

అయితే నటనలో ఈ అమ్మడుకు మంచి మార్కులు పడిన.. అదృష్టం లేక‌పోవ‌డంతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అంద‌లేదు. దీంతో సినిమా ఆఫర్లు తగ్గాయి. అలా టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత మ‌రోసారి విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన మ‌హారాజు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాల్లో అమ్మడు ఓ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ క్ర‌మంలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మ‌మ‌త‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

Film Views MY 🇲🇾 | Best Movie of The Year 2024 Has a Release Date! Vijay Sethupathi's Maharaja releasing worldwide on June 14th. Entire Overseas rights... | Instagram

తన వ్యక్తిగత జీవితం.. డేటింగ్ అంశాల‌పై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మమత మాట్లాడుతూ అమెరికాలో ఉన్న టైంలో ఒకరితో ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ తమ బంధం ఎక్కువ రోజులు నిలువ లేదని.. జీవితంలో బంధం ఉండాలి కానీ ఒత్తిడితో కూడిన బంధం నేను కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. లైఫ్ లో ఖచ్చితంగా ఓ తోడు కావాలని నేను భావించడం లేదంటూ వివరించింది. ప్రస్తుతానికి తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మమతా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.