ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ మామ.. భార్యతో కలిసున్న రొమాంటిక్ పిక్స్ వైరల్..?!

స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కాగా ప్రస్తుతం దిల్ రాజు ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి అమెరికా అందాలను ఆస్వాదిస్తూ ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం వీరి అమెరికన్ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో దిల్ రాజు, తన భార్య తేజస్వినితో ఎంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.

దిల్ రాజు నీలిరంగు డెనిమ్ షార్ట్, షర్ట్ వేసుకుని కనిపించాడు. తేజస్విని వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ పిక్స్ నెటింట వైర‌ల్ అవ్వ‌డంతో.. అభిమానులు దిల్ మామ.. హీరో కటౌట్ కు ఏమాత్రం తీసిపోడంటూ.. ఇద్దరు హీరో, హీరోయిన్ల ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు తేజస్విని రెండవ భార్య అన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో.. కొంత‌కాలానికి తేజస్విని నీ రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఈ జంట‌కు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక దిల్ రాజు సినిమాల విషయానికొస్తే చివ‌రిగా నిర్మించిన ఫ్యామిలీ స్టార్, లవ్ మీ సినిమాలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పాటు.. నితిన్ తమ్ముడు సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాల‌తో ఎలాంటి స‌క్స‌స్ అందుకుంటాడో వేచి చూడాలి.