‘ కల్కి ‘ ట్రైలర్.. సాక్ష్యం చూపించి మరి కాపీ ఆరోపణలు చేసిన ఆర్టిస్ట్.. ఇలా దొరికిపోయావేంటి అశ్విన్..?!

కల్కి సినిమా కౌంట్‌డైన్‌ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్‌ ఇండియన్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్, దిశాపటాని లాంటి ప్రధాన తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై.. అశ్విని ద‌త్త్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తాజాగా కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్ పై విమర్శలు చేశాడు.

సౌత్ కొరియాకు చెందిన సంగ్ చెయ్ కాన్సెప్ట్ డిజైనర్ గా హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేస్తూ ఉంటాడు. తాజాగా అతను తన ఇన్‌స్టా వేదికగా కల్కి యూనిట్ తన ఆటను కాపీ కొట్టిందంటూ ఆరోపించాడు. అందుకు తగ్గ సాక్షాన్ని సైతం చూపిస్తూ పదేళ్ల క్రితమే తన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన విజువల్ ఫోటోనే కల్కి ట్రైలర్‌ ప్రారంభంలో వాడుకున్నారు అంటూ స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేశాడు. ఒకరు కష్టపడి క్రియేట్ చేసిన ఆర్ట్‌ను దొంగిలించడం అనైతికం అంటూ ఆయన క్యాప్షన్ను జోడించాడు.

అయితే కొంతసేపటికి ఆ క్యాప్షన్ తొలగించి.. కల్కి సినిమా, వైజయంతి మూవీస్ అంటూ క్యాప్షన్ మార్చేశాడు. ఆ రెండు ఫోటోలను చూసి నెటిజ‌న్స్‌ షాక్ అవుతున్నారు. ఇలా కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయావేంటి అశ్విన్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మీ ఆర్ట్‌ను కాపీ చేసినట్లు ఇట్టే అర్థమవుతుంది.. కల్కి నిర్మాతలు ప్రభాస్ న్యూ లుక్ లీక్‌ చేసినందుకు వి ఎఫ్ ఎక్స్ కంపెనీ పై దావా వేశారు. మీరు కూడా మీ ఆర్ట్ కాపీ చేసినందుకు వారిపై లీగల్ యాక్షన్ తీసుకోండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి.