మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధ‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం ఫుడ్ కూడా డైట్ లేకుండా లాగించేస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను రాజమౌళి ఆఫ్రికన్ అడ్వెంచర్స్ మూవీగా రూపొందిస్తున్నాడు.

Is Mahesh Babu Taking on a Dual Role in Rajamouli's Next Film?

ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే .ఎల్. నారాయణ గ్రాండ్ లెవెల్లో రూపొందించనున్నాడు. బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా జక్కన్న డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందంటూ అభిమానులు భావించారు. ఆరోజు ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. అభిమానులకు నిరాశ ఎదురయింది.

RRR' and 'Baahubali' writer V Vijayendra Prasad on what keeps a writer  ticking - The Hindu

ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సెట్ వరకు మొత్తం పూర్తయిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందని ఆయన వివరించాడు. అలాగే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత.. సినిమా షూటింగ్ మొదలుకానిందని వివరించాడు. ఇది జరగడానికి మరో రెండు నెలలు సమయం పట్టవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.