నటాషా తో డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిన హార్దిక్.. ఏం చెప్పాడంటే..?!

టి20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్ 8 రౌండ్‌లో టీమిండియా చోటు ద‌క్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ లో మాత్రం హార్దిక్‌కు అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్‌ల‌లో అవకాశం వస్తే తప్పకుండా తన సత్తా చాటుతాడు అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా హార్దిక్ పాండే టోర్నీలో బాగా సెటిల్ అయినట్లు తెలుస్తోంది. మొద‌ద‌ట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వన్డే ప్రపంచ కప్ లో గాయం కారణంగా టోర్నీ నుంచి హార్దిక్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హార్దిక్ పాండేను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసి కెప్టెన్సీ ఇచ్చారు. దీంతో ముంబై అభిమానులు, రోహిత్ ఫ్యాన్స్ నుంచి భారీ ట్రోల్స్‌ ఎదురయ్యాయి.

Hardik Pandya's response to Ricky Ponting's 'How's family?' question ends  Natasa Stankovic divorce rumours at last | Crickit

దీనికి తోడు ఐపీఎల్‌లో హార్థిక్.. ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా ఆడియన్స్‌ను నిరాశ‌ప‌రిచింది. దీంతో పలు విమర్శలను ఎదుర్కొన్న హార్దిక్ ఆ విషయాన్ని మర్చిపోయేలోగా వ్యక్తిగత జీవితంలో తుఫాన్ మొదలైంది. హార్దిక్, భార్య నటాషా మధ్య విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే 15 రోజుల క్రితం నటాషా తన ఇన్స్టా వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేయడంతో ఈ ఈ వివాదానికి చెక్ పడింది. దీని తర్వాత హార్దిక్ మొదటిసారి తన వ్యక్తిగత జీవితంపై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. టి20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్, భారత్ హోరాహోరీగా తరబడిన సంగతి తెలిసిందే. భారత్ 119 పరుగులకే కుప్పకూలింది. అయితే పాక్ కేవలం 113 పరుగులకే పరిమితమైంది.

Hardik Pandya-Natasha Stankovic To Renew Their Wedding Vows, They Will Tie Knot On Valentine's Day

దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ఢిల్లీ క్యాపిటల్స్.. కోచ్ రికీ పాటింగ్ ఆ జ‌ట్టును అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడుతున్న అక్షర పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లను కలిసి.. తర్వాత హార్దిక్ పాండేతో వన్ టు వన్ అంటూ చిట్ చార్ట్ చేశాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో హార్దిక్ పాండే రియాక్ట్ అయ్యాడు. మొదట హార్దిక్.. రికీని అంత ఎలా జరుగుతుంది.. ఫ్యామిలీ ఎలా ఉంది.. అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ రికీ వాళ్లంతా కూల్ గా ఉన్నారు. మీ లైఫ్ ఎలా ఉంది అంటూ హార్దిక్‌ను ప్రశ్నించాడు. అంతా బానే ఉంది.. ఆల్ స్వీట్ అంటూ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి హార్దిక్, నటాషాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. వారంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ వీడియోను ఐసిసి యూట్యూబ్లో యాడింగ్ లైఫ్ ఆఫ్ రిక్కీ పాంటింగ్ టైటిల్ తో షేర్ చేశారు.