నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో ‘ కల్కి ‘ టీం.. నాగ్ అశ్విన్ నయా స్ట్రాటజీ అదుర్స్ .. ?!

పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంత మోస్ట్ అవెయిటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898ఏడీ. మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ డిష్టోఫియా మూవీ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. దీంతో మూవీ టీం కొత్త ప్లాన్ వేసి మరి ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు.

ఎల్ఈడి స్క్రీన్ లతో పదుల సంఖ్యలో భారీ వాహనాలను రెడీ చేసిన కల్కి టీం.. వీటి ద్వారా దేశ వ్యాప్తంగా ప్రమోషన్లు చేయాలని స్ట్రాటజీని పాటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వాహనాల ద్వారా ప్రజల్లోకి సినిమాను తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట‌ మేకర్స్. ఎల్ఈడి స్క్రీన్లతో సిద్ధమైన జీప్లతో ఓ వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మేకర్స్. దేశవ్యాప్తంగా కాంతిని విస్తరించేందుకు సిద్ధమవుతున్నామంటూ వైజయంతి మూవీస్ ఈ వీడియోను షేర్ చేసుకుంది.

ఈ వాహనాలకు ఉన్న ఎల్ఈడి స్క్రీన్ లలో ట్రైలర్ సహా ప్ర‌మోష‌న్‌ మెటీరియల్ అంతా ప్రదర్శించ‌నున్నార‌ని తెలుస్తుంది. దేశంలో అనేక ప్రాంతాలకు ఈ వాహనాలు వెళ్ళనున్నట్లు స‌మాచారం. ఇలా ప్రమోషన్ లో కొత్త స్ట్రాటజీని ఉపయోగించి కల్కిపై హైప్‌ తెస్తున్నాడు నాగ్‌ అశ్విన్. దీంతో ఇదెక్క‌డి మాస్ ప్లానింగ్రా బాబు అంటూ.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.