కమెడియన్ తో ఆ పని కానిస్తున్న మీనాక్షి చౌదరి.. ఫ్యాన్స్ షాక్..!

మీనాక్షి చౌదరి ..సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనముల నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . ఆ తర్వాత పలు సినిమాలో నటించిన అమ్మడు పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది . అయితే ఆ తర్వాత మాత్రం మెల్లమెల్లగా మీనాక్షి చౌదరి ఒక్కొక్క స్టార్ సినిమాలో నటించడానికి అవకాశాలు దక్కించుకుంది . గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన కూడా నటించింది .

పెద్దగా చెప్పుకోతగ్గ రోల్ కానప్పటికీ మహేష్ బాబు పుణ్యమాంటూ కోలీవుడ్లో ఆఫర్స్ అందుకునే స్థాయికి వెళ్ళిపోయింది . విజయ్ దళపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న గోట్ సినిమాలో హీరోయిన్ అమ్మడునే నటిస్తుంది. అయితే ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అందుకుంది మీనాక్షి చౌదరి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . స్టార్ కమెడియన్ సంతానం చేస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తుందట.

సంతానం హీరోగా చేస్తున్న దిల్లుకు దుడ్డు 3 సినిమాలో ఫిమేల్ లీడ్ గా మీనాక్షిని తీసుకున్నారట. ఈ సినిమాను కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తూ ఉండడం ..ప్రేమానంద్ డైరెక్ట్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఒకపక్క స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే మరొక పక్క కమెడియన్స్ తో కూడా ఈ విధంగా ముందుకు వెళుతూ ఉండడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తుంది . కంటెంట్ బాగా నచ్చే సంతానంతో నటించడానికి ఓకే చేసింది మీనాక్షి చౌదరి అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!