చరణ్ కంటే ముందుగా ఎన్టీఆర్ ఆ స్టార్ హీరో తో నటించాలనుకున్నాడా.. ఇంతకీ అతను ఎవరంటే..?!

తెలుగులో చాలా కాలం క్రితమే మల్టీస్టారర్ ట్రెండ్ బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు అంతా కలిసి మల్టీస్టారర్ లో నటించి మంచి సక్సెస్ సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కాలక్ర‌మేణా టాలీవుడ్ మల్టీసార‌ర్ సినిమాల హ‌వా తగ్గింది. ఇలాంటి క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్ సినిమాలు తెర‌కెక్కించి మరోసారి మల్టీస్టారర్ ట్రెండ్ ప్రారంభమయ్యేలా చేసాడు. ఈ సినిమా నుంచి చాలామంది స్టార్ హీరోస్ మల్టీ స్టార‌ర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే చ‌ర‌ణ్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Naatu Naatu' mania everywhere-Telangana Today

అయితే హృతిక్ రోషన్ తో కలిసి మ‌రోసారి మ‌ల్టీ స్టార‌ర్ సినిమా వార్ 2లో నటిస్తున్నాడు. కాగా వీటన్నిటికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా చేయాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ షోలో వెల్లడించాడు. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున. నాగార్జున తండ్రి ఏఎన్ఆర్, జూనియ‌ర్ ఎన్టీఆర్ తాత.. ఎన్టీఆర్ గారు ఎంత సన్నిహితంగా ఉండేవారన్న‌ సంగతి అందరికీ తెలిసింది. అలాగే నాగార్జున కూడా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను, ఎన్టీఆర్‌ను చాలా బాగా చూసుకునేవారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను సొంత అన్నల భావిస్తూ గౌరవించేవాడు.

NTR Meelo Evaru Koteeswarudu Full Episode | NTR MEK | NTR Nagarjuna MEK |  NTR About Sr NTR Dialogues | NTR About His Wife Pranathi | NTR Kalyanram  MEK | - Filmibeat

ఇక హరికృష్ణ, నాగార్జున కలిసి సీతారామరాజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. కాగా ఎన్టీఆర్ కు నాగార్జున కుటుంబంతో కలిసి తన కుటుంబం మల్టీ స్టార‌ర్ తీస్తే బాగుంటుంది అన్నే కోరిక ఉండేదట. ఈ విషయాన్ని గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు లో పాల్గొన్న ఎన్టీఆర్.. నాగార్జునతో స్వయంగా చెప్పారు. అలా చేస్తే నిజంగానే బాగుంటుంది అంటూ నాగ్ వివరించాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, ఏఎన్నార్, హరికృష్ణ ముగ్గురు లేరు. ఈ క్రమంలో అలాంటి మల్టీ స్టార‌ర్ సాధ్యం కాదు. కాగా నాగార్జున, ఎన్టీఆర్ కాంబోలో మల్టీ స్టార‌ర్ రావడం కూడా అంత సులువు కాదు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్, నాగార్జున ఇమేజ్ లకు వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ అంటే అంత సులువు కాదు.