గోట్ దర్శకుడును అమ్మ నా బూతులు తిడుతున్న నాగచైతన్య ఫ్యాన్స్.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద హీరో నాగచైతన్య . తాత నాగేశ్వరరావు మనవడిగా తండ్రి నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య తన సినిమాల విషయంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడో మనకు బాగా తెలుసు . ప్రజెంట్ తండేల్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య.

కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య ఫ్యాన్స్ గోట్ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ గోట్ . విజయ్ దళపతి హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు . మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది . ప్రభుదేవా – ప్రశాంత్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు . నిన్న విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన గోట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్ము దులిపేస్తుంది .

ఇలాంటి మూమెంట్ లోనే నాగచైతన్య అభిమానులు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుని ఆడేసుకుంటున్నారు . దానికి కారణం నాగచైతన్యతో కస్టడీ అనే సినిమాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు డిజాస్టర్ తన ఖాతాలో వేసుకోవడమే . తమిళ్ దర్శకుడు కావడంతో తమిళ్ హీరోలకి మంచి మంచి కథ అందిస్తున్నాడు అని ..నాగచైతన్య కస్టడీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అని.. కానీ పరమ చెత్త కంటెంట్ ఇచ్చాడు అని ..నాగచైతన్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . కస్టడీ సినిమా చూసి గోట్ టీజర్ చూస్తే కచ్చితంగా ఈ సినిమాను తెరకెక్కించింది ఈయననే నా అనే సందేహాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని కావాలనే ఆయన ఇలా నాగచైతన్య ఖాతాలో ఫ్లాప్ వేసాడు అని మండిపడుతున్నారు..!!