నాగార్జున.. ఒకవైపు తను హీరోగా సినిమాలు చేస్తూనే మరొకవైపు వేరే స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ వస్తున్నాడు . మరీ ముఖ్యంగా ఇప్పుడు నాగార్జున తన టోటల్ కాన్సన్ట్రేషన్ తన 100వ సినిమా పైనే పెట్టి ఉన్నాడు . ఈ సినిమాలో నాగచైతన్య – అఖిల్ – అమలా కూడా నటించే విధంగా ప్లాన్ చేస్తున్నారట . మనం సినిమాకి మించిపోయే రేంజ్ లో ఈ సినిమా స్టోరీ ఉండబోతుందట . అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార – త్రిష పేర్లు వినిపిస్తూ ఉండగా మధ్యలో కాజల్ పేరు కూడా ఆడ్ అయింది .
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నాగార్జున తన కొడుకు కెరియర్ని సెటిల్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు . అయితే అఖిల్ మాత్రం ఆ విషయంలో ఎటువంటి హెల్ప్ తండ్రి దగ్గర నుంచి తీసుకోకూడదు అనుకుంటున్నాడు . అయితే తన 100వ సినిమాతో పాటు నాగార్జున అఖిల్ నటించిన బోయే సినిమాలో కీలక పాత్రలో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అంతేకాదు ఒక బాలీవుడ్ దర్శకుడు నాగార్జున దగ్గరికి స్వయంగా వెళ్లి ఈ కథను అఖిల్ కోసమే రాశాను అంటూ వివరించారట .
అఖిల్ నటించబోయే సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించే విధంగా స్టోరీ రాసుకున్నారట . ఆశ్చర్యం ఏంటంటే ఆ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా ఇప్పటివరకు హిట్ కొట్టలేదు. అఖిల్ కూడా ఇప్పటివరకు హిట్ కొట్టలేదు . జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్లు ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో మరొక ఫ్లాప్ హీరో నటిస్తే ఆ సినిమా కూడా ఫ్లాపే అవుతుంది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు . అసలు ఇలాంటి కాంబో ని ఎలా సెట్ చేశావు నాగార్జున అంటూ బుర్ర పీక్కుంటున్నారు అక్కినేని అభిమానులు..!!