పుష్ప 2 కోసం బాలయ్యను రంగంలోకి దించబోతున్నారా..? సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!

ఇప్పుడు ఎలాగైనా సరే సుకుమార్ ముందు ఉన్న టార్గెట్ ఒకటే ఒకటి.. పుష్ప2 సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయితే సరిపోదు మేకర్స్ పెట్టిన దానికి డబల్ ప్రాఫిట్స్ రావాలి. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలి ఈ సినిమా కోసం కష్టపడిన దానికి ఫలితం దక్కాలి.. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సుకుమార్ అని .. కొన్ని కొన్ని ఆయన తీసుకున్న డెసిషన్స్ ద్వారానే తెలిసిపోతుంది. పుష్ప 2 సినిమాపై ఈ మధ్యకాలంలో ఎలాంటి నెగిటివిటీ ఎదుర్కొన్నారో మనం చూసాం ..బన్నీ పొలిటికల్ పరంగా వేలు పెట్టడం అది కాస్త ఆయన సినీ లైఫ్ కి బాగా ఇబ్బందులకు గురయ్యాలా చేసింది .

అయితే మొదటి నుంచి బన్నీ అంటే చాలా రెస్పెక్ట్ ఫుల్ గా ఉండే సుకుమార్ పుష్ప 2 సినిమా విషయంలో కొత్త స్ట్రాటజీను అప్లై చేస్తున్నారట . ఈ సినిమా కోసం బాలయ్యను రంగంలోకి దించబోతున్నారట . ఈ సినిమాలో బాలయ్య కు సంబంధించిన కొన్ని పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ ను యాడ్ చేయబోతున్నారట. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల నుంచి కొన్ని డైలాగ్ క్లిప్స్ క్రాప్ చేసి సమయానుసారం ఈ సినిమాలో బన్నీ ఆ డైలాగ్స్ ను అప్లికేబుల్ చేసేలా కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారట .

దీనికోసం ఇప్పటికే బాలయ్య పర్మిషన్ కూడా తీసేసుకున్నారట ..అంతేకాదు ఈ సినిమా విషయంలో ఇప్పుడు సుకుమార్ బన్నీ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారట. ఎలాగైనా సరే పుష్ప 2 పై వచ్చిన నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకోవడానికి సుకుమార్ వేస్తున్న ప్లాన్స్ వేరే లెవెల్ అంటున్నారు ఫాన్స్ . కచ్చితంగా సుకుమార్ కష్టానికి ఫలితం దక్కుతుంది అంటూ ప్రశంసిస్తున్నారు..!!