బాలీవుడ్ బడా ప్రాజెక్టులో సంయుక్త మీనన్.. జాక్ పాట్ కొట్టిందిగా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సంయుక్త మీనన్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో గోల్డెన్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తను నటించిన‌ అన్ని సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోయింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టార‌ర్ భీమ్లా నాయక్‌తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో సంయుక్తకు వరుస ఆఫర్లు క్యూ క‌ట్టాయి. ఇలా బింబిసార , సార్, విరూపాక్షా లాంటి సినిమాల్లో నటించి వరుసగా స‌క్స‌స్‌ల‌తో హ్యాట్రిక్ హిట్ను అందుకుంది.

Samyuktha (@iamsamyuktha_) • Instagram photos and videos

దీంతో అమ్మడుకు గోల్డెన్ బ్యూటీగా భారీ పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంయుక్త.. తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతుంది. సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలోను తగ్గకుండా తన అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులలో నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు భారీ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి.

అందులో బ్లాక్ కలర్ టాప్, బాటమ్ వైట్ కలర్ ధరించి మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ళ మతి పోగోడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో నెటింట‌ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సంయుక్తకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా సంయుక్త బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఒక బడా ప్రాజెక్టులో సంయుక్త మీనన్ భాగం కాబోతుందని.. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్దిరోజులో ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.