ఇట్స్ అఫీషియల్: కల్కి సినిమా నుంచి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. పండగ చేసుకోండి రా ఫ్యాన్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . అది ఇంట్లో కాదు సినీ రంగంలో కాదు ..సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కాదు స్కూల్స్లో కాదు .. ఎక్కడ చూసినా సరే ప్రభాస్ ప్రభాస్ ..కల్కి కల్కి కల్కి ఇలానే మాట్లాడుకుంటున్నారు . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు రెబల్ అభిమానులు . పలువురు బడా సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండడం గమనార్హం . కాగా ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది .

అతను సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకుంటారు . ప్రీమియర్ షో లతో పాటు రెండు మూడు రోజుల వరకు టికెట్స్ బాగానే హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోతాయి . రీసెంట్గా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి . నార్త్ అమెరికాలో ఎక్కువగా ఇండియన్స్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ మన తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తారు . కాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకి దాదాపు 3 మిలియన్స్ కలెక్షన్స్ అక్కడ రిలీజ్ కు ముందే వచ్చేస్తాయి.

ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సైతం అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్స్ వసూల్ అయ్యాయి . ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా కన్ఫామ్ చేసింది. ఇప్పటివరకు 77,777 టికెట్లు అమ్ముడు అయ్యాయి అని ..ఒక పోస్టర్తో అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది . ఈ సినిమా కి ఆస్ధాయి ఆదరణ లభిస్తూ ఉండడంతో సినిమా పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. చూద్దాం మరి ఫస్ట్ డే ఏ విధంగా కలెక్ట్ చూస్తుందో ఈ సినిమా..?