వావ్: సోషల్ మీడియాని మడత పెట్టేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో..!

సాధారణంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వద్దన్నా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని కొన్ని రేర్ పిక్చర్స్ మాత్రం అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కొంతమంది ఆయన మూడు పెళ్లిళ్లు అంటూ ట్రోల్ చేసిన మరి కొంత మంది మాత్రం పవన్ వ్యక్తిగత విషయాలు పై ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే .

అంతే కాదు ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా ప్లాన్స్ వేసి ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయాడు . ఫైనల్లీ నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అవ్వగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నాడు . పవన్ విజయం తర్వాత అఖీరానందన్ ఆద్యా కూడా బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చారు. పవన్ గెలిచిన దగ్గర నుంచి నాన్న పక్కనే ఉంటూ వచ్చిన అఖీరానందన్ ఫోటోలు ఎలా వైరల్ అయ్యాయో చూసాం .

ప్రమాణస్వీకారానికి హాజరైన ఆద్య – అకిరాలతో పవన్ కళ్యాణ్ ఆయన భార్య దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జనరల్ గా ఇలాంటి ఫొటోస్ బయటకు వచ్చినప్పుడు ట్రోలింగ్కి ఎక్కువగా గురవుతూ ఉంటుంది . ఎందుకంటే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ కి మూడో భార్య ..అకిరానందన్ ఆద్య పుట్టింది రేణు దేశాయికి.. అయినా సరే చాలా ప్రేమతో కుటుంబంతో ఫొటోస్ తీసు కోవడం పిల్లల బాధ్యతలను చూసుకోవడం పవన్ కళ్యాణ్ మంచితనానికి నిదర్శనం అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!!