30 లక్షల బడ్జెట్ లో తెరకెక్కి ఏకంగా 12 కోట్లు కలెక్ట్ చేసిన .. ఉదయ్ కిరణ్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో మనం చూస్తున్నాం. కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టిన సరే కనీసం పెట్టిన దానికి గిట్టుబాటు ధర కూడా రావడం లే. దు స్టార్స్ మాత్రం కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . ఒక్కొక్క హీరో 100 కోట్లు తీసుకుంటున్నారు . అయితే అలాంటి హీరోలు నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుందా ..? అంటే నో అన్న సమాధానమే వినిపిస్తుంది . కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాల కూడా అస్సలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోలేకపోతున్నాయి . అయితే గతంలో పరిస్థితి వేరు తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్స్ అందుకునే వాళ్ళు మేకర్స్ .

కాగా ఆ లిస్టులో మన ఉదయ్ కిరణ్ కూడా టాప్ ప్లేస్ లో ఉంటాడు . చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు పైనే అవుతుంది . అయినా సరే ఇంకా అభిమానుల మనసుల్లో మంచి స్థానాన్ని దక్కించుకొని ముందుకెళ్తున్నాడు ఉదయ్ కిరణ్ . ఆయన ఫోటో చూసినప్పుడల్లా ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అయినప్పుడల్లా ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంటారు.

లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన మూవీ చిత్రం. ఆయన మొదటి చిత్రం ఇదే. ఈ సినిమాతోనే తిరుగులేని విజయం అందుకున్నాడు . రికార్డులు కొల్లగొట్టాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ లో రామోజీరావు నిర్మించారు . 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా హైయెస్ట్ గ్రాస్ ల లో ఒకటిగా నిలిచింది . 30 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 12 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది. ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ కేవలం 11000 రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!