2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఈరోజు మొదలుకానుంది. దీంతో సార్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మొదటిసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయ బేరి మోగించడమే కాదు.. ఆయన తన పార్టీ నుంచి ఎన్ని చోట్ల పోటీ చేశారో అన్నింటిలోనూ సక్సెస్ సాధించి రికార్డ్ సృష్టించాడు. దీంతో వారికి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే చాలామందికి ఆహ్వానాలు అందినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, రజనీకాంత్ ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు.. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వెళ్ళిందా లేదా అనే సందేహం అభిమానుల్లో వినిపిస్తున్నాయి. కొందరేమో జూనియర్ ఎన్టీఆర్కు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందిందంటూ.. మరికొందరు ఎలాంటి ఇన్విటేషన్ అందలేదంటూ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్‌కోసం తారక్ గోవాలో బిజీగా ఉన్నాడని సమాచారం.
ఇక ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్కు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే నేషనల్ మీడియాలో మాత్రం తారక్‌కు ఆహ్వానం అందిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ప్రమాణ స్వీకారానికి తారక్‌కు నిజంగానే ఆహ్వానం అందితే ఆయన ఇక్కడకు వస్తున్నాడా లేదా అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రమాణ స్వీకారం మొదలుకానున్న క్రమంలో ప్రమాణస్వీకారంలో ఎన్టీఆర్ ఎంట్రీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.