హమ్మయ్య.. ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తీరిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆ విషయంలో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఇన్నాళ్ళకి ఊపిరి పీల్చుకుంటున్నారు. రెబల్ స్టార్ ను బాహుబలి సినిమాలో చూసిన తర్వాత అంతటి హిట్ అందుకోలేకపోయాడు . బాహుబలి తర్వాత పలు సినిమాలో నటించిన లుక్స్ పరంగా కూడా ప్రభాస్ తన అభిమానులను సాటిస్ఫైడ్ చేయలేకపోయాడు . సాహో సినిమాలో పర్లేదు అనిపించిన కొందరి అభిమానులను మాత్రం ఆ లుక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి .

ఆ తర్వాత వచ్చిన సినిమాలలో కూడా ప్రభాస్ లుక్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు . అయితే కల్కి సినిమాలో అయినా సరే ఓ విధంగా లుక్స్ పరంగా హైలెట్ అవ్వాలి అని ఆశపడ్డారు రెబెల్ ఫాన్స్ . ఫైనల్లీ ముంబైలో జరిగిన కల్కి ప్రమోషన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి . దీంతో రెబల్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు . పోనీలే ఈ సినిమా లోనైనా ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా కనిపించబోతున్నాడు అంటూ హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు .

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్గా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు ప్రభాస్ అభిమానులు. కమల్ హాసన్..అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా ఈ సినిమాలో నటించారు. అశ్వినీ దత్ ఏకంగా 600 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు చేశారు..!!