దేవర నుండి ఫియర్ లిరికల్ సాంగ్ వచ్చేసిందోచ్.. తారక్ చించి చించి పడేసాడుగా (వీడియో)..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువగానే ఉంటుంది . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో నటించిన కాకుండా ఫ్యాన్స్ ఇష్టాఇష్టాలను అర్థం చేసుకొని అటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు . అందుకే తారక్ ని ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ద్వారానే తెలుగులో డబ్లు ఇవ్వబోతుంది. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ ఇప్పుడు థాయిలాండ్ లో జరుగుతుంది. కాగా ఇప్పటికే థాయిలాండ్ కి వెళ్లిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ . తారక్-జాన్వీ ల మధ్య రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట . అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా దేవర సినిమా నుంచి ఫియర్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ వీడియో సూపర్ సూపర్ సూపర్ గా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటకి హైలైట్ గా మారింది . కొన్ని పదాలు అయితే ఎన్టీఆర్ ని ఊహించుకొని రాసినట్లు ఉంది . మరీ ముఖ్యంగా విజువల్స్ కి అనిరుధ్ మ్యూజిక్ కి .. జూనియర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కి కెవ్వు కేక అనే రేంజ్ లో ఉన్నాయి . ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కే కాకుండా అందరికీ నచ్చుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు. సెప్టెంబర్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది..!