ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకున్నాడా..? ఏంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇది..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పొలిటికల్ పరంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు ..వామ్మో పవన్ రేంజ్ ఏవిధంగా మారిపోయిందో చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏపీ పొలిటికల్ గేమ్ ఛేంజర్ అంటూ పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేస్తున్నాడు . ఓవైపు వైసీపీ దారుణాతి దారుణంగా ఓడిపోవడం మరొకవైపు టిడిపి భారీ మెజారిటీతో గెలవడం దీనంతటికి కారణం..

పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు పొగడడం పవన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది . అయితే ఇక్కడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అభిమానులకి కొంచెం ఇబ్బందికరంగా మారింది . చాలామంది పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుస్తాడు అంటూ ముందుగానే అంచనా వేసేసారు.. అయితే పవన్ కళ్యాణ్ గెలవడం ఓకే.. గెలిచిన తర్వాత మినిస్టర్ పదవి చేపట్టాక సినిమాల్లో నటిస్తాడా..? నటించడా..? అన్న విషయంపై మాత్రం ఎవ్వరు పెద్దగా ఆలోచించలేదు .

నిజానికి పవన్ కళ్యాణ్ కూడా మినిస్టర్ పదవి చేపట్టాక సినిమాలో అడపాదడపా నటించాలి అంటూ అనుకున్నారట. కానీ పిఠాపురం నియోజకవర్గంలో భారీ భారీ ఓట్ల మెజారిటీతో తనను గెలిపించిన జనాలకు సేవ చేయాలి అని సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడట . పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రజలపైనే చేయాలి అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట . దీంతో ఈ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది దీన్ని చాలా లైట్ గా తీసుకున్నారు మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఏంటిది పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలా హ్యాండ్ ఇచ్చారే అంటూ బాధపడిపోతున్నారు..!!