నెక్స్ట్ రాజకీయాలోకి రాబోయే స్టార్ హీరో ఇతనే.. అప్పుడే కర్చీఫ్ వేసేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద గొప్ప మ్యాటర్ కాదు.. పెద్ద విచిత్రమైన మ్యాటర్ కూడా కాదు.. ఎందుకంటే ఆల్రెడీ ఎంతోమంది స్టార్స్ రాజకీయాలలోకి వచ్చి తమదైన స్టైల్ లో పరిపాలన చేసి అదరగొట్టేశారు ..జయలలిత – ఎంజీఆర్ – స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇలా ఎంతమంది పేర్లు చెప్పుకున్న తక్కువే . అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా నిలిచిపోయాడు .

ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీలో నుంచి రాజకీయాల్లోకి రాబోయే ఆ టాప్ సెలబ్రిటీ ఎవరు అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ గా మారింది . ఆల్రెడీ ఒకసారి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అంటూ స్థాపించి బొక్క బోర్ల పడి ఆ పార్టీకి టాటా బై బై.. చెప్పేసాడు విలీనం చేసేసాడు . ఇక చిరంజీవి రాజకీయాల్లోకి రాడు అది అందరికీ తెలుసు . ఇప్పుడు అందరి కళ్ళు కాన్సన్ట్రేషన్ నాగార్జున – వెంకటేష్ పైనే పడ్డాయి . టాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే నాలుగు పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.

చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ ఆల్రెడీ బాలకృష్ణ టిడిపిలో ఉన్నాడు. ఇక మిగిలింది నాగార్జున – వెంకటేష్ ..నాగార్జున ఎప్పటికీ ఇండస్ట్రీలోనే ఉంటాడు . అది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వెంకటేష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న మ్యాటర్ వైరల్ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేసిన ఇద్దరు కాండిడేట్స్ భారీ మెజారిటీతో గెలుపొందడం దీనికి కారణం. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తను బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!