సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక కేవలం హీరోయిన్ పాత్రలో చేస్తాము అంటే కుదరదు .. చేతికి వచ్చిన ప్రతి పాత్ర చేయగలగాలి.. అయితే కొంతమంది హీరోయిన్స్ ఇలా చేయడానికి ఇష్టపడరు..కారణం ఏదైనా కావచ్చు .. కొంతమంది అలా చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపరు . అయితే తాజాగా అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష .
త్రిష వయసు 40 దాటిపోయింది . అయినా సరే కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంది . మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లోను బడా బడా టాప్ సెలబ్రిటీస్ సరసన నటించే అవకాశం అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి . కాగా ఇప్పుడు త్రిష ఒక హీరోయిన్ కి అక్క పాత్రలో కనిపించబోతుందట. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ఓ క్రేజీ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకుందట . ఈ ప్రాజెక్టులో త్రిష అక్క పాత్రలో కనిపించబోతుందట .
ఒక యంగ్ హీరోయిన్ కి అక్క పాత్రలో కనిపించడానికి రెడీ అవ్వడం పట్ల త్రిష ఫ్యాన్స్ ఫుల్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో సౌందర్య మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది అని .. ఇప్పుడు ఆమె స్థానంలోకి నువ్వు వచ్చావని నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని త్రిష ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో త్రిష కంటెంట్ ఉన్న పాత్రను చూస్ చేసుకుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . మరి చూద్దాం త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఏం మాత్రం తన పేరుని ముందుకెళ్లే విధంగా తీసుకెళ్తుందో..???