ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి ట్రెండ్ అవుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త బాగా హైలైట్ గా మారుతుంది. దానికి తోడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో విభేదాలు అని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
దానికి తగ్గట్టే సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని ఇన్ స్టా లో అన్ ఫాలో చేయడం పెద్ద రాద్ధాంతంగా మారిపోయింది . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఉపాసన కొణిదెల తన కూతురు కింకారాతో టైం స్పెండ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది . ఈ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఉపాసన ..క్లీం కార ను చేతుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటో లేదంటే ఆడుకుంటున్న ఫోటో మాత్రమే షేర్ చేసింది .
ఫర్ ది ఫస్ట్ టైం..బుడిబుడి అడుగులు వేస్తూ చరణ్ – ఉపాసన ఆమె చేతులు పట్టుకొని ఉన్న ఫోటో రిలీజ్ చేసింది. ఈ ఫోటో చూసినా అభిమానులు అప్పుడే క్లీంకార ఇంత పెద్దది అయిపోయిందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు. జూన్ 20 వ తేది క్లీం కార పుట్టిన రోజు..మరి కొద్ది రోజుల్లోనే ఆమె ఫస్ట్ బర్త డే సెలబ్రేట్ చేసుకోబోతుంది. అయితే ఈ పిక్స్ లో కూడా ఫేస్ మాత్రం రిలీజ్ చేయకపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి..!!
View this post on Instagram