సౌందర్య బ్రదర్ పెళ్లికి వెళ్లిన ఒక్కే ఒక్క హీరో ఇతనే..ఎంత స్పెషల్ అంటే..?

సౌందర్య.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేయించుకుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంతేనా సౌందర్య నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేసుకున్నాయో కూడా మనకు తెలిసింది . కాగా సౌందర్య అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . సౌందర్యకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా హీరోయిన్ సౌందర్య కి తన బ్రదర్ అంటే ఎంత ఇష్టం అనే విషయం చాలా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది .

తన బ్రదర్ పెళ్లికి ప్రతి రూపాయి కూడా సౌందర్యాన్ని ఖర్చు చేస్తూ ఘనంగా అంగరంగ వైభవంగా చేసింది. కాగా అప్పట్లో సౌందర్య బ్రదర్ పెళ్లి ఒక సెన్సేషన్ గా మారింది.. సౌందర్య బ్రదర్ పెళ్లికి కేవలం టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క హీరో వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ . సౌందర్య విక్టరీ వెంకటేష్ కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూసి ఏదో వీళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి .

సరిగ్గా అదే మూమెంట్లో సౌందర్య బ్రదర్ పెళ్లికి విక్టరీ వెంకటేష్ ఒక్కడే అటెండ్ కావడం సంచలనంగా మారింది. అయితే ఆ టైంలో ప్రేమించుకుందాం సినిమా షూటింగ్లో ఉన్నారు వెంకటేష్ సౌందర్య ..అదే మూమెంట్లో బెంగళూరులో ఉండడంతో సౌందర్య వెంకటేష్ను మాత్రమే పెళ్ళికి పిలిచిందట . ఈ విషయం తెలియని కొందరు పెళ్లి గురించి నానా విధాలుగా మాట్లాడుకున్నారు . అంతేకాదు సౌందర్య వెంకటేష్ మధ్య అక్రమ సంబంధం కూడా అంటగట్టారు . ఆ తర్వాత ఆ విషయం పై ఎన్నో ఇంటర్వ్యూలలో అటు వెంకటేష్ ఇటు సౌందర్య క్లారిటీ ఇచ్చారు..!!